Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం త్రీ టౌన్‌లోని ఎస్సీఐ కార్యాలయం వద్ద గురువారం జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశానికి కార్మిక నాయకుడు ఈగ మల్లారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వర రావు, వ్యకాస జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్‌లు మాట్లాడుతూ మోడీ గత ఏడు సంవత్సరాల నుండి ప్రయివేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు దారాదత్త చేస్తున్నాడన్నారు. మరోవైపున కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి దేశాన్ని దివాలా తీయిస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, భూక్య శ్రీనివాసరావు, బండారి యాకయ్య, పాశం సత్యనారాయణ, వేల్పుల నాగేశ్వరరావు, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.