Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో
దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శం
అ కలెక్టర్ గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం
శాంతి సమాజ నిర్మాణం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ గౌతమ్ అన్నారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) పురష్కరించుకుని ఖమ్మం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో స్మృతి పరేడ్ కార్యక్రమం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అంతర్గత భద్రతలో ఎంతో మంది పోలీసు అమరుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నామని అన్నారు. మనిషిగా పుట్టిన ఏ ఒక్కరూ చెయ్యలేని అతి పెద్ద త్యాగం ప్రాణత్యాగమని, అలాంటిది వేలాది మంది పోలీసులు దేశం కోసం ప్రాణాలను అర్పించడం అనిర్వచనీయమన్నారు. నక్సల్స్ ప్రభావితమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు రాత్రి పగలు అనే తేడా లేకుండా అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఫలితంగానే మారుమూల ఆటవీ ప్రాంతాలలో సైతం అభివద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికీ జిల్లాలో సైబర్ క్రైమ్, గంజాయి వంటి అక్రమ రవాణా నియంత్రించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం సత్ఫలితాలు సాధిస్తుందన్నారు. స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పోలీసు కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ మాట్లాడుతూ పోలీసులు కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి సమాజ సేవ చేశారని చెప్పారు.
పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలెక్టర్ ,
పోలీస్ కమిషనర్ భేటీ
పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ పరంగా రావాల్సిన అన్ని రాయితీలు వచ్చే విధంగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. తొలుత దేశవ్యాప్తంగా 2020 సెప్టెంబర్ నుంచి 2021 ఆగష్టు వరకు ఉగ్రవాదులు, తీవ్రవాదుల చర్యలలో అమరులైన 377 మంది పోలీసుల పేర్లను ప్రాంతాలను డీసీపీ ఇంజరాపు పూజ ఒక్కొక్కటిగా చదువుతూ వారికి జిల్లా పోలీసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. శ్రద్దాంజలి ఘట్టించారు.
కార్యక్రమంలో ఎంఎల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, నగర మేయర్ నీరజ, డిసిపి ఇంజరాపు పూజ, డీసీపీ ఎల్సీ నాయక్, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డిసిపి కె.ప్రసాద్, (ఏఆర్) అడిషనల్ డిసిపి కుమారస్వామి, ఏఎస్పీ స్నేహ మెహ్రా ఏఆర్ ఏసిపి విజయబాబు, ఏసిపిలు రామోజీ రమేష్, ఆంజనేయులు, వెంకటేశ్, ప్రసన్న కుమార్, జహంగీర్, ఏవో అక్తరునీసాబేగం, సిఐలు చిట్టిబాబు, శ్రీదర్, సర్వయ్య, గోపి, అంజలి, సత్యనారాయణ రెడ్డి, సురేష్, వసంతకుమార్, హాతీరాం, ఆర్ఐలు శ్రీనివాస్, రవి, తిరుపతి, శ్రీశైలం సాంబశివరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, జానీమియా, జ్యోతి, హౌంగార్డు అసోసియేషన్, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .