Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మృతుని కుటుంబానికి రూ.1.85
లక్షల నష్టపరిహారం చెల్లింపు
నవతెలంగాణ - బోనకల్
ప్రమాదవశాత్తు బోనకల్ సమీకృత హాస్టల్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలం లోని రావినూతల గ్రామానికి చెందిన అల్లిక బక్కయ్య (53) బోనకల్ సమీకృత హాస్టల్లో వాటర్ ట్యాంక్‌ను క్లీన్ చేయడానికి శానిటేషన్ కాంట్రాక్టర్ కూలికి తీసుకెళ్ళాడు. బక్కయ్య హాస్టల్ రెండవ అంతస్తు పైకి వెళ్ళాడు. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి మృతిచెందాడు. మృతునికి భార్య కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన...
అల్లిక బక్కయ్య మతిచెందాడని విషయం తెలుసుకున్న బంధువులు హాస్టల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ కూడా అక్కడికే చేరుకున్నాడు. బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో కాంట్రాక్టర్ లక్షా 50 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ తర్వాత బంధువులు ప్రిన్సిపాల్ కారుకు అడ్డం తిరిగారు. మృతునికి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకు ఆమె తిరస్కరించింది. హాస్టల్‌కు తాను పిలిపించ లేదని, ఆ పనికి తనకు ఎటువంటి సంబంధం లేదని పూర్తి బాధ్యత కాంట్రాక్టర్‌దే అని స్పష్టం చేశారు. అయినప్పటికీ తాను మానవతా దృక్పథంతో 35 వేల రూపాయలు ఇస్తానని స్పష్టం చేశారు. దీంతో మృతుల బంధువులు కూడా అంగీకరించారు.