Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వం ఇచ్చిన నోటీసును వెనక్కి
తీసుకోవాలి
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
పొన్నం వెంకటేశ్వరరావు
అ నాయకన్‌గూడెంలో భారీ ప్రదర్శన
నవతెలంగాణ- కూసుమంచి
ఇండ్లు నిర్మించుకుని 40 ఏండ్లకు పైగా నివాసం ఉంటున్న నిరుపేదలైన వారి ఇండ్లను తొలగించాలంటూ నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన నోటీసును తక్షణమే వెనక్కు తీసుకోవాలని, పేదల గుడిసెలను తొలగించడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. నాయకన్‌గూడెం గ్రామంలో ఐబి బజార్ (గిన్నె చెట్ల)లో ఉన్నటువంటి నిరుపేదల ఇండ్లను తొలగించా లంటూ నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను తక్షణం వెనక్కి తీసుకోవాలంటూ, ఆ గ్రామంలో గృహాలు కోల్పోతున్న నిరుపేదలు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఖమ్మంలోని నీటి పారుదల శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం నీటిపారుదల శాఖ సిఈ(చీఫ్ ఇంజినీర్ ఇరిగేషన్ ఖమ్మం) జి.శంకర్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరావు మాట్లాడుతూ...ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రచారం చేసుకుంటోందని, మరోవైపు నలభై సంవత్సరాలుగా ఇండ్ల కట్టుకుని నివాసం ఉంటున్న నిరుపేదల ఇండ్లలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకునే నిరుపేదలను కాపాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బారి మల్సూర్, మండల కమిటీ సభ్యులు కర్ణబాబు, నాయకులు గడ్డం మురళి, ఉల్లోజు వేణు, సోమయ్య, ఖాసీం, కృష్ణంరాజు, పవన్, ఐద్వా నాయకులు గడ్డం అంజమ్మ, నిర్వాసితులు పాల్గొన్నారు.