Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- నేలకొండపల్లి
నిబద్ధత గల కార్యకర్తను కోల్పోయా మని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని ఆరెగూడెం గ్రామంలో సిపిఎం కార్యకర్త రాగం వెంకన్న(46) గురువారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న నున్నా నాగేశ్వరరావు వెంటనే ఆరెగూడెం చేరుకొని రాగం వెంకన్న భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాల్లర్పించిన వారిలో పార్టీ జిల్లా నాయకులు వై విక్రమ్, మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, ఏటుకూరి రామారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, గ్రామ శాఖ కార్యదర్శి మీగడ లింగరాజు, గోళ్ల అచ్చయ్య, గుత్తా లక్ష్మీనరసయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు కణతాల వెంకటేశ్వర్లు, బోయినపల్లి వీరయ్య, కొండలరావు, మేకల ఉపేందర్, ఎస్ నాగేశ్వరరావు, లోడుగు శ్రీను, సర్పంచి దొనకొండ రామకృష్ణ, వివిధ పార్టీల నాయకులు అవినేని శేషయ్య, దొంతగాని జగ్గయ్య, చిలకల భూషయ్య, వడ్డే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.