Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరాటౌన్
ప్రజల పక్షాన నికరంగా నిలబడి ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజలకు న్యాయం జరిగే వరకు నవతెలంగాణ దినపత్రిక నిరంతరం పనిచేస్తుందని నవతెలంగాణ జనరల్ మేనేజర్లు ఎం.సుబ్బా రావు , లింగారెడ్డిలు అన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా నవతెలంగాణ విలేకరుల వర్క్ షాప్ గురువారం వైరా పట్టణంలోని మధు విద్యాలయంలో రీజనల్ మేనేజర్ జావీద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ పత్రిక ముందుంటుందన్నారు. కార్మికులు, కర్షకులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నవతెలంగాణ పత్రిక నిరంతరం కృషి చేస్తుందన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మధు విద్యాసంస్థల కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రరావు మాట్లాడుతూ ప్రజాసంక్షేమం ధ్యేయంగా ప్రజా సమస్యలను వెలికి తీస్తూ, ప్రజల మన్నలను నవతెలంగాణ పత్రిక విలేకరులు పొందుతున్నారని అన్నారు. జర్నలిజం విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్య పరిరక్షణకు, సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నవతెలంగాణ విలేకరులను అభినందించారు. కార్యక్రమంలో మధు విద్యాసంస్థల ఉపాధ్యక్షులు మల్లెంపాటి ప్రసాదరావు, మఫిషియల్ స్టేట్ ఇంచార్జి వేణుమాధవ్, డెస్కు ఇంచార్జీ వీరేష్, ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.