Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వరులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ కార్మికులకు వారం రోజుల్లో పెరిగిన పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని, లేనియెడల సంఘం ఆధ్వర్యంలో సమ్మెలో వెళ్తామని సమ్మె నోటీసు ఇవ్వడంతో వారం రోజులు వేతనాలు చెల్లించి ఏర్పాట చేస్తామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు టూ టౌన్ నాయకులు వెంకన్న, కళ్యాణి, మానస, సైదమ్మ, రాములమ్మ, నాగమణి, ఉష, ప్రశాంతి, రాధా, హైమా, మీరా తదితరులు పాల్గొన్నారు.