Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
మూవీఆర్టిస్ట్అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా గొర్రెలు కాచేవారిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని తెలంగాణ గొర్రెలు మేకలపెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో కూసుమంచి సీఐకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బారి మల్సూర్ మాట్లాడుతూ తమ వృత్తిని చులకనగా మాట్లాడుతూ గొర్రెలు కాచేవాడు కూడా ఫోన్ వాడుతున్నాడంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇంకొకరెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెసు బిసి సెల్ నాయకులు దాసరి వెంకన్న, కూసుమంచి మాజీ సర్పంచ్ బారి వీరభద్రం, సంఘం మండల కార్యదర్శి చీర్ల రాధాకృష్ణ, శీలం జానయ్య తదితరులు పాల్గొన్నారు.