Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదులాపురం పీఏసీఎస్ ఛైర్ పర్సన్‌గా వూరడి హైమావతి బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఏదులాపురం ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘం చైర్‌పర్సన్‌గా వూరడి హైమావతి గురు వారం బాధ్యతలు స్వీకరిం చారు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తు, అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చైర్మన్ ఏనుగు ధర్మారెడ్డిని విధుల నుంచి తొలగించి ఆ స్థానంలో వైస్ చైర్ పర్సన్‌గా ఉన్న హైమావతికి చైర్ పర్సన్‌గా బాధ్యతలు అప్పగిస్తు డీసీవో విజయకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు హైమావతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంఘం పాలకవర్గ సభ్యులు సమావేశమై డీసీవో ఆదేశాలను అమలు పరుస్తు తీర్మానం చేశారు. డిసీవో ఆర్డర్ కాపీని సంఘం సీఈవో మహమ్మద్ ఆలీ ఛైర్పర్సన్ హైమావతికి అందజేశారు.ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా రైతులు మెచ్చేలా పాలన అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు హైమావతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు అల్లిక వెంకటేశ్వరరావు, జర్పుల లక్ష్మణ్ నాయక్, మహమ్మద్ మౌలానా, పాసంగుల చందర్రావు, నీరజ, గుండు శ్రీను, మేదరమెట్ల శ్రీను, శ్రీనివాస్, సీఈవో మహమ్మద్ ఆలీ, సిబ్బంది పాల్గొన్నారు.