Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని ఏఎస్పీ శభారీష్ అన్నారు. గురువారం పోలీస్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థూపం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ భానుప్రకాష్, అశ్వాపురం సీఐ సట్ల రాజు పాల్గొన్నారు.
గుండాల : సమాజంలో పోలీసులు నిర్వర్తిస్తున్న పాత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సీఐ చెన్నూరి శ్రీనివాస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పీఎస్ఐ రాజశేఖర్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకున్న పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి అని సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ నుండి లక్ష్మీనగరం స్టేట్ బ్యాంక్ మీదుగా ములకపాడు సెంటర్ వరకు అమరవీరుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోహార్ పోలీస్ అమరవీరులా రా మీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు పోలీసులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.