Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
నవతెంలగాణ-కొత్తగూడెం
ఆధునిక కాలంలో అనేక మంది జింక్ ఫుడ్‌కు అలవాటు పడ్డారని, దీని వలన ఆనేక ఆనర్ధాలు ఉన్నాయని, పిల్లకు పౌష్టికాహారం అందించాలని కొత్తగూడెం సీడిపిఓ కనకదుర్గ అన్నారు. గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్ యార్డులో చిరుధాన్యాలపై ఆహార పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపీఓ మాట్డాడారు. జింక్ ఫుడ్ వాడకం వలన గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. చిరుధాన్యాల వలన అందమైన ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటి విలువ చిన్న పిల్లలకు అలవాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిరుధాన్యాలతో తయారు చేసిన అనేక పిండి వంటలు, పలహారాలు ప్రదర్శన ఏర్పాటు చేశారు. అంగన్వాడీ సెంటర్స్‌లో ఉన్న చిన్నారులకు, తల్లి దండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంజరు నగర్ సర్పంచ్ పద్మ, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి పద్మ, ఎంపిటీసి భద్రమ్మ, సూపర్వైజర్ పి.వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.
దుమ్ముగూడెం: చిరుధాన్యాలతో గర్భిణీలు, బాలింతలు చిన్నపిల్లల్లో వచ్చే పోషకాహార లోపాన్ని నివారించవచ్చు అని దుమ్ముగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి నవ్యశ్రీ అన్నారు. గురువారం ప్రాజెక్టు పరిధిలోని మారాయిగూడెం సెక్టార్లో గల లచ్చిగూడెం గ్రామంలో గల రైతు వేదిక భవనంలో చిరుధాన్యాల పండుగ కార్యక్రమం నిర్వహించారు. వాసన్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరుధాన్యాలలో ఐరన్, కాల్షియం వంటి అనేక విటమిన్లు వుంటాయి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను గర్భిణీలు, బాలింతలు, తల్లులు, గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ముత్యాలరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు మాణిక్యమ్మ, ధనలక్ష్మి, కవిత, సావిత్రి పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.