Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయంతి వేడుకల్లో ఏఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
జాతి మనుగడ కోసం చిన్న వయసులోనే ఉద్యమం బాట పట్టి ఆదివాసీల కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన కొమరం భీం ఆదివాసీల ఆరాద్యం దైవం అని ఏఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు అన్నారు. శుక్రవారం ఏఎస్పీ, ఏవిఎస్పీ మండల కమిటీల ఆధ్వర్యంలో కొమరం భీం 120వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో పర్ణశాల నుండి తూరుబాక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లకీëనగరం ఏఎస్పి దిమ్మె వద్ద జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన చిత్ర పట్టానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పి జిల్లా ప్రదాన కార్యదర్శి నూప సీతయ్య, బిఎస్పి నాయకులు చెన్నం నాగరాజు, కంచర్ల సింహాద్రి, అచ్చుతాపురం, నడికుడి సర్పంచ్లు కృష్ణవేణి, రామకృష్ణ, ఉపసర్పంచ్ బి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : భూమి కోసం భుక్తి కోసం అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన మహా ఘనుడు కొమరం భీమ్ జయంతి వేడుకలను ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షులు మడవి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : మండల పరిధిలోని పాతగంగారంలో కొమరం భీం జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత గంగారం ఎంపీటీసీ విజయ కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో మడకం సురేష్, ఇర్పా ప్రసాద్, భద్రం, రమేష్, కృష్ణ, రవి, ఆదివాసీ యువత పాల్గొన్నారు.