Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా హుజరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలప్రచారం చేపట్టింది. హుజురాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో అటు కరీంనగర్ ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రముఖులు ఉన్నారు. అయినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి రాష్ట్ర కార్యదర్శి తాత మధు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్, ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి, ఇల్లందు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధీర్ తోతల, ఇల్లందు, టేకులపల్లి లారీ అసోసియేషన్ అధ్యక్షులు యలమద్ది రవి, కౌన్సిలర్ జెకె శ్రీను, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఎస్ రంగనాథ్, పెండ్యాల హరికృష్ణ, గుండ శ్రీకాంత్, వాసు, తెరాస యువజన నాయకులు, సోషల్ మీడియా విభాగం ఎంటెక్ మహేందర్ తోపాటు అనేక మంది తరలి వెళ్లారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో అనేక గ్రామాల్లో గత వారం రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం సిరిసేడు గ్రామంలో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ర్యాలీ రాయల్ సార్ అనంతరం కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీనివాస రెడ్డి, గణేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.