Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ తిరుమల రెడ్డి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఏజన్సీ ప్రాంత గిరిజనులకు పౌష్టిక ఆహారంపై చైతన్యం తీసుకు వచ్చే భాద్యత ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులపై ఉందని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ కె.తిరుమల రెడ్డి అన్నారు. ఆహార భద్రతా చట్టం అమలు తీరుపై క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శుక్రవారం ఆయన ఆహార భద్రతా సభ్యులు శారద, భారతిలతో కలసి మండలంలో పర్యటించారు. ముందుగా నర్సాపురం జిల్లా పరిషత్ పాఠశాల సందర్శించి మద్యాహ్న బోజన వంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా వంట కుక్‌లను ప్రతి రోజు విద్యార్ధులకు ఏఏ వంటలు అందజేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించి అక్కడ చిన్నారులకు, బాలింతలకు, గర్భిÛణీలకు అందజేస్తున్న పౌష్టిక ఆహారం గురించి అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ తీసుకుంటున్న జాగ్రత్తలు, అందవలసిన పోషక ఆహార పదార్ధాలు సమయానికి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల బరువును పరిశీలించారు. అనంతరం నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన లకీëనగరం గిరిజన బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ఎంత మంది విద్యార్ధులు ఉన్నారు. కరోనా సమయం వారికి అందుతున్న పౌష్టికాహారం గురించి స్థానిక సర్పంచ్ సరియం రాజమ్మ, ఎంపీపీ, రేసు లకీë, జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వసతి గృహాల ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న మెనూ వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధనసరి నాగమణిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆహార భద్రతా చట్టం ద్వారా ప్రజలు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం లకీëనగరం జీసీసీ చౌకదుకాణాన్ని పరిశీలించి, లబ్దిదారులతో మాట్లాడారు. లకీëనగరం సర్పంచ్ సరియం రాజమ్మ మండలంలో ఉన్న రేషన్ కార్డుల సమస్యను ఆయన దృష్టికి తీసుకు పోయారు. వెంటనే ఆయన పక్కన ఉన్న జిల్లా పౌర సంబందాల అధికారి చంద్ర ప్రకాష్ దృష్టికి తీసుకు పోవడంతో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు.
అనంతరం ఆయన పర్ణశాల రామయ్యను దర్శించుకుని పర్ణశాల పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను సర్పంచ్ తెల్లం వరలకీëని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమశాఖ డీడీ నాగమణి, స్త్రీ శిశుసంక్షేమ శాఖ పీడీ వరలకీë, డీఆర్డీఓ పీడీ మధుసూధనరావు, జిల్లా వైద్యాధికారి శిరీష, తహశీల్దార్ వర్షా రవికుమార్, ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి, ఎంపీఓ ముత్యాలరావు, జీసీసీ డీఎం కుంజా వాణి, ఆర్ఐ ఆదినారాయణ, ఏటిడబ్ల్యుఓ పూనెం నర్సింహారావు, ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జయసూరి, నర్సాపురం సర్పంచ్ వర్షా శివరామకృష్ణ, లకీëనగరం ఎంపీటీసీ వనజలు పాల్గొనగా ఎస్సై రవికుమార్ పోలీస్, సిఆర్పిఎఫ్ బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.