Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టన్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఎంతో ప్రపంశనీయమని కలెక్టన్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి మెమెంటోలు అందచేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరదలు, వినాయక నిమజ్జనం, అమ్మవారి నిమజ్జన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది జిల్లా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని చెప్పారు. గోదావరి వరదలు సమయంలో నీట మునిగిన ప్రజలు అనుసరించాల్సిన చర్యలు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు జూన్ 24వ తేదీన కమాండెంట్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం మన జిల్లాకు విచ్చేసారని చెప్పారు. గోదావరి పరివాహాక ప్రాంత ప్రజలకు ఏ సమయంలో వరద ముంపు సంబవించినా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సంసిద్ధంగా ఉండేవారని చెప్పారు. అత్యవసర సమయాల్లో జిల్లా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఎంతో అభినందనీయమని ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. నాలుగు నెలల పాటు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు అందుబాటులో ఉన్నందుకు హర్షం వ్యక్తం చేశారు. త్యవసర పరిస్థితుల్లో మీ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ఎఫ్ కమాండెంట్ రాజీవ్ కుమార్, డీఆర్ఓ అశోక చక్రవర్తి, భద్రాచలం తహసిల్దార్ శ్రీనివాసయాదవ్, ఆర్ఎస్ఐ బిక్కులాల్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.