Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న దళితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25న కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగే చలో కలెక్టరేట్ మహా ధర్నాను విజయవంతం చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం భద్రాచలంలో ఛలో కలెక్టరేట్ మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల అందరికీ దళిత బంద్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ టౌన్ సెక్రెటరీ మందా రమణయ్య, టౌన్ గౌరవ అధ్యక్షులు కృష్ణార్జున రావు, మైపా సుందర్, మల్లయ్య, మహేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.
చండ్రుగొండ : ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రాయి రాజా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. బ్యాంకు లింకేజీ లేకుండా దళిత బంధు అర్హులైన వారందరికీ ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చైర్మెన్ కమిషన్ చైర్మెన్ వెంటనే నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మిర్యాల మోహన్ రావు, మండల నాయకులు నందమూరి వినోద్, బేతీ సీతారాములు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.