Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం''టాటా మోటార్స్'' తమ యస్.యు.వి. సిరీస్లో భాగంగా ''టాటా పంచ్'' కారుని తెలంగాణ లోని అతిపెద్ద డీలర్ అయిన ''వెంకటరమణ మోటార్స్'' ఖమ్మం ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా ఈ ''టాటా పంచ్'' కారుని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత తక్కువ బడ్జెట్ ఇంత సేఫ్టీ ఫీచర్స్, స్టైల్ లుకింగ్ తీసుకురావటం టాటా వారికే సాధ్యం అని కొనియాడారు. ఈ యస్యువి టాటా పంచ్ తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు. వెంకటరమణ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సబా కాంపాక్ట్ యస్యువిలో భాగంగా మధ్యతరగతి, చిన్న ఫ్యామిలీ కస్టమర్లకు ఎంతో సౌకర్యవంతంగా, గ్లోబల్ యన్.సి.ఎ.పి. నిర్వహించిన క్రాష్ టెస్టింగ్ ''5'' స్టార్ట్ రేటింగ్ సాధించిందని 1199సి.సి., 3 సిలిండర్స్తో , డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోఫోల్స్ ఓ. ఆర్.వి.యం. 1.2 పెట్రోల్ ఇంజీన్, మాన్యువల్ ఆటోమాటిక్ వేరియంట్లతో మొత్తం 7 రంగులలో ఎ.బి.యస్., ఇ.బి.డి. కలిగిన బ్రేక్ సిస్టం, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 5 సీటర్స్ సామర్థ్యంతో, 18.82 కి.మీ. మైలేజ్ ఇస్తుంది అని అన్నారు. టాటా పంచ్ 366 లీటర్ల బూట్ స్పేస్ కలిగి, లాంగ్ డ్రైవ్ కు సౌకర్యవంతంగా, ఆటోమాటిక్ క్లయిమేట్ కంట్రోల్ తో, దీని ప్రారంభ ధర ఎక్స్: షోరూం: 5.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది అని అన్నారు. ఈ ''టాటా పంచ్'' బుకింగ్స్ ప్రారంభమైనదని, కస్టమర్స్ మిగత వివరాలకు ''వెంకటరమణ మోటార్స్'' ఖమ్మంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ద్రౌపతి , వికాస్ చౌదరి , సంస్థ ప్రతినిధులు, కస్టమర్స్ పాల్గొన్నారు.