Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్
- పాఠశాలను సందర్శించిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం
నవతెలంగాణ- రఘునాథపాలెం
రఘునాధపాలెం మండల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం( కేజీబీవీ ) పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ(ఎం) మండల ప్రతినిధి బృందంతో కలిసి కస్తూరిబా పాఠశాలను వారు సందర్శించారు. నూతనంగా నిర్మించిన భవనం కావడంతో అనేక పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆడపిల్లలు చదువుకోవాల్సిన పాఠశాల కాబట్టి చుట్టూ ప్రహరీ గోడ లేకపోతే ఇబ్బందులు వస్తాయని అన్నారు. తక్షణమే ప్రహరి గోడ నిర్మించాలని అన్నారు. కోతుల బెడద తీవ్రంగా ఉన్నందున మెస్ డోర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఉండే విధంగా చూడాలని అన్నారు. ప్రతి రూములో వెంటిలేటర్ మెస్‌లు ఏర్పాటు చేయాలని, ఉతికిన బట్టలు ఆరేయడానికి దండాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకు నేటప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరంతరం విద్యార్థుల చదువుల విషయంలో శ్రమిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, మండల కార్యదర్శి ఎస్.నవీన్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు గుగులోత్ కుమార్, నరేష్ పాల్గొన్నారు.