Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్
నవతెలంగాణ- ఖమ్మం
గంజాయి నేరస్థులకు చెక్ పెట్టేందుకు క్షేత్రస్ధాయిలో సమాచార, నిఘా వ్యవస్థను పటిష్ట పరిచి అవసరమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పోలీసు కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు అధికారులతో మాట్లాడారు. జిల్లాలో అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని సూచిం చారు. గంజాయి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్‌పై కేసులు నమోదు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా నియం త్రణ క్రమంలో ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు. జిల్లా సరిహద్దుల నుండి వచ్చే అక్రమ రవాణా నియంత్రించేందుకు మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించాలని సూచించారు. నేరాలు జరగకుండా వుండేందుకే అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నేరాలకు పాల్పడుతున్న నిందితుల జాబితాను సిద్ధం చేసి పి.డి యాక్ట్ అమలు చేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై దృష్టి సారించి...ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.