Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం వ్యకాస ఆధ్వర్యంలో నాయకులు తహసీల్దార్ కె.మీనన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలోని రామగోవిందాపురం ఎస్సీ కాలనీకి చెందిన 50 నిరుపేద కుటుంబాలకు 30 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు పెంకుటిళ్లు, పక్కా ఇండ్లను నిర్మించారని, ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. వానకు కురుస్తున్న ఇండ్లలో కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి, ఎక్కడో ఓ చోట ఓ 20 ఇండ్లు నిర్మించి వాటినే గత ఏడు సంవత్సరాలుగా చూపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.50 లక్షలు కేటాయించి వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొట్టా మాధవి, ఊకే దివ్య, అమల, జయలకీë, తిరుపతమ్మ, మురళీ, రవీంద్ర పాల్గొన్నారు.