Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి దండ్రుల జ్ఞ్నాపికగా, కుటుంబ సభ్యులు, విద్యార్ధుల సహకారంతో..
- దయా హృదయం చాటిన అధ్యాపకుడు వినరు కుమార్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ టాపర్లుగా నిలిచి పేదరికంతో ఉన్నత చదువులను కొనసాగించ లేని స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్ధినుల పట్ల ఆ అధ్యాపకుడు దయా హృదయం చాటాడు. తల్లి దండ్రులు పెయ్యల వినరు కుమార్, దెబోరా క్రిస్టియానా జ్ఞ్నాపకార్ధంగా కుటుంబ సభ్యులు, కశాశాల సిబ్బంది, విద్యార్ధుల సహకారంతో రూ.20 వేలు సేకరించి పేద విద్యార్ధులకు అందజేశారు. వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2018-2020 విద్యా సంవత్సరంలో చిన్నబండిరేవు గ్రామానికి చెందిన మేకల స్వరూప, ములకపాడు గ్రామానికి చెందిన బోళ్ల మౌనికలు టాపర్స్ నిలిచారు. వీరి ఆర్ధిక పరిస్తితి అంతంత మాత్రంగా ఉండడంతో ఉన్నత చదువులను ఆపి వేశారు. కాగా ఆదే కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పని చేస్తున్న పెయ్యల వినరు కుమార్ వీరి ఉన్నత చదువులు కొనసాగించే విదంగా తన వంతుగా ఆర్ధిక సాయం చేయాలనుకున్నాడు. తన తల్లి దండ్రుల పేరున రూ.5 వేలతో పాటు వారి, ఆక్క బావ అయినటువంటి ప్రియ సుధ, కిషోర్ బాబుల వద్ద రూ.5 వేల, ఖమ్మంకు చెందిన రేచల్, నరేష్ కుమార్లు రూ.3,500, సుభాషిణి, రవి దంపతులు అందజేసిన రూ.3,500లతో పాటు వేంసూరు గ్రామానికి చెందిన సరితారత్నం అందజేసిన రూ.వెయ్యితో పాటు కళాశాలలో పని చేస్తున్న ఫిజిక్స్ అధ్యాపకుడు అందజేసిన రూ.వెయ్యితో పాటు కళాశాల విద్యార్ధులు సేకరించిన మొత్తం రూ.20 వేల కళాశాల ప్రిన్సిపల్ ఎల్.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా చెరో రూ.10 వేల పేద విద్యార్దులకు అందజేశారు. కాగా బోళ్ల మౌనిక ఉన్నత చదువుల కోసం గతంలో సీఐ నల్లగట్ల వెంకటేవ్వర్లు రూ.5 వేల నగదు అందజేయడంతో పాటు ఆమె ఉన్నత చదువుల కోసం తన వంతు సహాయ సహకాలు అందిస్థానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు, సిబ్బంది, విద్యార్దులు పాల్గొన్నారు.