Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
పేద ప్రజల గుండె చప్పుడు, సంక్షేమ కార్యశీలి, గొప్ప మానవతావాది ఎస్.ఆర్.శంకరన్ అని రిటైర్డ్ లెక్చరర్ టి.లక్ష్మీనర్సయ్య తెలిపారు. శుక్రవారం ఖమ్మంలో మంచికంటి భవనంలో కె.వి.పి.ఎస్. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్.ఆర్. శంకరన్ 87వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎల్ నర్సయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ ఐఎఎస్ హెదాలో చట్టానికి మానవతా విలువల్ని జోడించి అమలుపర్చి చూపిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. నిరుపేదల పాలన ప్రజా పాలనగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశమని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయుటలో ఆయన కృషి అభినందనీయమన్నారు. 1984లో సాంఘిక గురుకుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేసి అనేక పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు సత్యనారాయణ, రజక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు దోనేపల్లి వెంకన్న, డివైఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్, అఫ్టల్, నవీన్ రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.