Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఖమ్మం కార్పొరేషన్
స్థానిక 23వ డివిజన్ శాంతినగర్ మిషన్ హాస్పిటల్ ఏరియాలో డీవైఎఫ్ఐ వన్‌టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అక్షయ కంటి ఆసుపత్రి మేనేజ్మెంట్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా సిపిఎం వన్ టౌన్ సెక్రెటరీ జబ్బర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీర్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల కోసం పోరాడుతూ అదే సమయంలో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని అన్నారు. ఈ క్యాంపులో 150 మందికి పైగా కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారన్నారు. అక్షయ హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ మహేష్ చాలా బాగా సహకరించారని, ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో కూరపాటి శ్రీనివాస్, రావులపాటి నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, సత్తనపల్లి నరేష్, కణతాల వెంకటేశ్వర్లు, సిపిఎం వన్ టౌన్ నాయకులు దాసరి నాగేశ్వరావు, భాస్కర్, నాగుల్ మీరా, రెహమాన్, మహారాజ్ షేక్ సాహెబ్ ఉద్దీన్, సరస్వతి, అజిత, ఎస్.కె బేగం, అక్షయ హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.