Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైడర్లు, బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు : సీఐ
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఖమ్మం-సూర్యాపేట ప్రధాన రహదారిపై మండలంలోని నాయుడుపేట, పెద్దతండా ప్రాంతాల వద్ద రోడ్డు ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు డివైడర్లు, బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు, రేడియం స్టిక్కరింగ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాహన దారులంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతి వేగాన్ని తగ్గించాలని, మద్యం తాగి వాహనాలు నడపారదని సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ శంకర్రావు, ఆర్అండ్బీ డీఈ చంద్రశేఖర్, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.