Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియుడి ఇంట్లో మూడోవ రోజు దీక్ష
- సంఘీబావం ప్రకటించిన మహిళా సంఘాలు
నవతెలంగాణ-కారేపల్లి
ప్రేమించిన యువకుడితో పెండ్లి జరిపించాలని డిమాండ్‌తో ప్రియుడు ఇంటి ముందు యువతి పట్టు వీడకుండా దీక్ష చేస్తుంది. మూడు రోజులుగా కారేపల్లిలోని ప్రియుడు సముద్రాల వేణు ఇంటి వసారాలో యువతి సునిత దీక్ష చేస్తుంది. ఆమె దీక్షకు మహిళా సంఘాలు, బీజేపీ, సీపీఐ లు శుక్రవారం మద్దతు ప్రకటించాయి. ప్రేమించి మోసం చేసిన యువకుడితో యువతి వివాహం జరిగే వరకు మద్దతుగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ప్రేమ పేరుతో యువతులను మోసగించటం ఇటివల కాలంలో ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో యువతికి న్యాయం జరగపోతే అఖిల పక్షం ఆధ్వర్యంలో యువతికి మద్దతుగా ప్రత్యక్ష అందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు ఏపూరి లతా దేవి, ఐద్వా మండల కార్యదర్శి కే.ఉమావతి, పీవోడబ్ల్యూ కార్యదర్శి వై.జానకీ, సీపీఐ నాయకులు బోళ్ల రామస్వామి, బీజేపీ నాయకులు తురక నారాయణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.