Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
వసతి గృహాలు ప్రారంభం కానున్న తరుణంలో వసతి గృహాల్లో వసతుల కల్పనపై శ్రద్ద పెట్టాలని రీజినల్ జాయింట్ డైరక్టర్ ఆర్.సత్యనారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం కారేపల్లిలోని కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. వసతి గృహాల్లో వసతులపై కేజీబీవీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌ను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాంలో విద్యార్ధులకు ఆహార వసతి కల్పనకు కావల్సిన నిత్యావసర వస్తువులు నిల్వలను పరిశీలించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు టెండర్లు కాకపోవటంతో సరుకులను స్ధానికంగా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాల్లో నిరంతరం పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. శానిటేషన్ చేయించి విద్యార్ధులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆర్జేడీ వెంట ఎంఈవో డీ.జయరాజు, ప్రిన్సిపాల్స్ మహమ్మద్ అక్తర్, ఝాన్సీసౌజన్య తదితరులు ఉన్నారు.