Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ఆందోళన
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.పద్మ డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
మినీ అంగన్వాడీ వర్కర్లు టీచర్స్ విధులు హెల్పర్స్ విధులు రెండు రకాల విధులు మినీ అంగన్వాడి టీచర్ నిర్వహిస్తుందని. వేతనం మాత్రం హెల్పర్స్ కిచ్చే వేతనం ఇస్తూ వారి శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని, మినీ అంగన్వాడీ వర్కర్లకు మేయిన్ టీచర్స్‌తో సమానంగా వేతనం చెల్లించాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి జి.పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అంగన్వాడీ వర్కర్స్ వారి సమస్యలసు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ముందుగా స్థానిక సీఐటీయూ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు మినీ అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా అంగన్వాడి జిల్లా కార్యదర్శి జి.పద్మ మాట్లాడుతూ మినీ అంగన్వాడి వర్కర్లను కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకున్నారని తీసుకునే నాడు కేవలం మీరు టిహెచ్ఆర్ ఇస్తే సరిపోతుందని, మీకు ఇతర పనులు చెప్పమని విధుల్లోకి తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మినీ అంగన్వాడీ వర్కర్ల పై మరింత పనిభారాన్ని మోపారని, ఇల్లు ఇల్లు తిరగాలి పిల్లలను తీసుక రావాలి, వంట చేయాలి, ప్రీస్కూల్ నడపాలి, రికార్డ్స్ రాయాలి, ప్రభుత్వ సర్వేలు చేయాలి, టీచర్ పని, హెల్పర్స్ పని, రెండు రకాల విధులను మినీ అంగన్వాడీ టీచర్ నిర్వహిస్తోందని వివరించారు. ఇన్నిపనులు చేస్తున్న హెల్పర్‌కు ఇచ్చే జీతం ఇవ్వడం సరైనది కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా మినీ వర్కర్ల శ్రమను గుర్తించి వారి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని, మెయిన్ టీచర్‌తో సమాన జీతం ఇవ్వాలని, హెల్పర్‌ను నియమించాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీను, గుడెపూరి రాజు, అంగన్వాడి జిల్లా అధ్యక్షులు ఈసం వెంకటమ్మ, ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి, మినీ వర్కర్లు శ్రీలత, సావిత్రి, ఆదిలక్ష్మి, లక్ష్మి, సుజాత, సుశీల, భాను, మినీ వర్కర్స్ పాల్గొన్నారు.