Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంనకు చెందిన విశ్రాంత ఉద్యాన శాఖ అధికారి, గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు గోళ్ళ భూపతి రావుకు గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. శనివారం చెన్నైలో ఈ పురస్కారం అందుకున్నారు. గత పది సంవత్సరాలుగా పర్యావరణంలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ సేవలు, వివిధ సంస్ధలకు చేయూత, కోవిడ్ తీవ్ర రూపం దాల్చిన సమయంలో బాధితులకు సహాయం, భద్రాచలంలో పార్కుల ఏర్పాటు ఉద్యాన రైతులకు సలహాలు, సూచనలు గాను ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆ ప్రయాణం లోనే గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అమెరికా కేంద్రంగా పనిచేస్తూ దాని అనుబంధంగా చెన్నై నగరంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం పర్యావరణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న గోళ్ళ భూపతి రావుకు గౌరవ డాక్టరేట్ పురస్కారానికి యూనివర్సిటీ సెనేట్ ఎంపిక చేశారు. శనివారం పాండిచ్చేరి నగరంలోని షేన్ భాగ్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని గోళ్ళ భూపతిరావుకు యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చైర్మెన్ డాక్టర్ పి. మేన్యూల్, గౌరవ అతిథి రిటైర్ జడ్జి మురుగన్ భూపతి, రిటైర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంపత్ కుమార్, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షణ్ముగ సుందరం, డాక్టర్ సిఆర్ భాస్కరన్ చెన్నై, డాక్టర్ ఆర్ దానపల్లి న్యూఢిల్లీ వారి నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ఈ పురస్కారం ద్వారా నామీద మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ఇంకా చురుగ్గా పాల్గొంటానని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ ప్రయాణంలో నాతో పయనిస్తున్న మిత్రులు యోగి సూర్య నారాయణ, రంగా రావు, జి.యస్. శంకర్ రావు, రాజిరెడ్డి, వై.వి. గణేష్, పి. దేశప్ప, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల రావు, కామిశెట్టి కృష్ణార్జున రావు, నాగరాజు, శ్రీ దేవీలకు కృతజ్ఞతలు తెలిపారు.