Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-పాల్వంచ
చట్టబద్ధ హక్కులకోసం మున్సిపల్ కార్మికులు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషాలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంఘం 6వ మహాసభ అన్నరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరవాత పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తుందిని అన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు దేశ సంపదను కష్టజీవుల కష్టాన్ని దార పోస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మికులను రోడ్డుపాలు చేస్తుందని విమర్శంచారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వ్యవస్థనే ఉండదని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడేండ్లు గడుస్తున్నా క్రమబద్ధీకరణపై మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరటి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కోసం సమిష్టిగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. పాల్వంచ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు, జిల్లా సమితి సభ్యులు బాగం రాంప్రసాద్, దేవరకొండ నాగచారి, ఉప్పుశెట్టి రాహుల్, పద్మజ, ఏఐటీయూసీ నాయకులు ఉపేంద్ర చారి, రమేష్, గుండాల నాగరాజు, శ్రీను, నాగేశవరరావు, రామయ్య, రమేష్ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.