Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పోడు భూముల సర్వే చేస్తానన్న జాడ ఎక్క కానరావడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ ఎంపీ మిడియం బాబురావు సూటిగా ప్రశ్నించారు. శనివారం ములకపాడు యలమంచి సీతామయ్య భవన్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించి పోడు రైతుల పోలికేక సదస్పులు, సడక్ బంద్‌లు, సెమినార్లతో ఉలిక్కి పడ్డ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వర్షాకాలపే అసెంభ్లీ సమావేశాల్లో అక్టోబర్ మూడో వారంలో ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తామని, నవంబర్ మొదటి వారంలో సర్వే చేపడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సర్వే నేటికి ఎందుకు ప్రారంభించ లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీసా గ్రామ సభలలో ఎప్ఆర్సీ కమిటీల ద్వారా దరఖాస్తులు స్వీకరించి వెంటనే సర్వే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అటవీ పరిరక్షణ సవరణ బిల్లు ప్రైవేటు కార్పొరేట్లకు సులభంగా కట్ట బెట్టే విదంగా ఉందని దీనిని సీపీఐ(ఎం) పార్టీగా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పోడు భూముల హక్కుల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోడు సాగుదారులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. దుమ్ముగూడెం మండలంలో పార్టీ పూర్వ వైభవం కోసం పార్టీ శ్రేణులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అద్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణ, పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, నాయకులు మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, సరియం రాజమ్మ, బొల్లి సూర్యచందర్ రావు, యాసా శ్రీనివాసరెడ్డి, కంగాల రాంబాబు, మర్మం సమ్మక్క, సోయం నాగమణి, కాక కృష్ణ, వాగే ఖాదర్‌బాబు, గుడ్ల సాయిరెడ్డి, కె. గోవర్దన్, సరియం ప్రసాద్, రాంబాబు, నర్సయ్య, నాగయ్య, రాణి తదితరులు పాల్గొన్నారు.