Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది మంది అభ్యర్థుల ఎంపిక
నవతెలంగాణ-పాల్వంచ
మున్సిపాలిటీ పరిధిలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన ప్రాంగణ నియామకాలు ముగిసాయి. చీఫ్ వీడియో టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ నియామకాల్లో కొత్తగూడెం ఖమ్మం జిల్లాల నుంచి 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరందరికీ సంస్థ సీనియర్ ఇంజనీర్ డి.రాకేష్ కుమార్ మోహన్ రాత పరీక్ష ఇంటర్వ్యూలను నిర్వహించారు. దీంట్లో పది మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరికి రూ.30 వేల నుండి రూ.35 వేల వరకు జీతభత్యాలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ డాక్టర్ భారత్ కృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.