Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యాన్నదానంకు హైదరాబాద్ వాసి రూ.లక్ష విరాళం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం ఆర్జిత సేవలో భాగంగా అంతరాలయంలో సువర్ణ తులసార్చన నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు ఈ సేవలో పాల్గొన్నారు. అలాగే స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాములు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో బి. శివాజీ అనంతరాములకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం నిర్వహించి ఆలయం తరపున జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన శ్రీరంగం అరవిందు-లక్ష్మీ లావణ్య దంపతులు దేవస్థానం నిత్యన్నదానంకు రూ.1,00,116లు విరాళంగా అందజేశారు. వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విరాళంను దేవస్థానం ఈవో బి.శివాజీకి అందజేశారు.