Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ బాడీ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ డీవీ
నవతెలంగాణ-ఇల్లందు
నవంబర్ 15న వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ మహాగర్జన సభ విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇల్లందు పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొక్కు నాగేశ్వర రావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పాల్గొని మాట్లాడారు. సభకు ఇల్లందు పట్టణ ప్రాంతం నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అందించిన అభివృద్ధి ఫలాలను గడపగడపకు నాయకులు, కార్యకర్తలు చేరవేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, రాష్ట్ర రైతు సమన్వయ సభ్యులు మాధవరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు పి.వి.కృష్ణారావు, నరసింహారావు, వార్డ్ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పినపాక: రాష్ట్ర సమితి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 25న నిర్వహించనున్న, అలాగే నవంబర్ 15 వరంగల్లో జరిగే విజయ గర్జన సభలు విజయవంతం చేయాలని పినపాక టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లు సత్తిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు సోంపల్లి తిరుపతి, గ్రామ నాయకులు బుర్ర సురేష్ గౌడ్, రాములు గౌడ్, సొంత రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు.