Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు
- బహుళ అంతస్తుల నిర్మాణాలు మీకు కనిపించడం లేదా..?
- బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను విస్మయానికి గురిచేస్తుందని, పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చుతున్నారు...పెద్దలు కట్టుకున్న బహుళ అంతస్తుల నిర్మాణాల ఎందుకు కూల్చడంలేదని, మీకు ఈ నిర్మాణాలు కనిపించడంలేదా..? అని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ ఘాటుగా విమర్శించారు. శనివారం పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ ఇటీవల మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ఇండ్ల బాధితులను కలుసుకున్నారు. కూల్చిన ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పేద, మధ్య తరగతి ప్రజల మీద ప్రతాపం చూపిస్తారు కానీ బాడ వ్యాపారులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారి పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, పక్కనే ఉన్న చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్ళడం లేదో జిల్లా అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ఇర్పా కామరాజు, గుడివాడ రాజేందర్, గోదా రజని అంబేద్కర్, బాపనపల్లి కళ్యాణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.