Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పంచాయ తీల పరిధిలో ఇంటి పనులు నూరు శాతం వసూలు చేసే విధంగా సిబ్బంది పని చేయాలని, శానిటేషన్ సక్రమంగా నిర్వహించి రోడ్ల పైన, రోడ్డు పక్కన చెత్త కనిపించకుండా ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మి రమాకాంత్ ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో మండల పంచాయతీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపిఓ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామ సభలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పంచాయతీలకు సంబంధించి రాబడి, నిలువ పట్టికను గ్రామ సభలో ప్రదర్శించాలన్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు బ్యాంకుల నుండి లోను తీసుకున్నందున వాటి నెలవారీ ఈఎంఐ ప్రతినెల 5వ తేదీ లోపు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి జూపల్లి హరిప్రసాద్, డిఎల్పిఓ పవన్, జిల్లాలోని 22 మండలాల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.