Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీపీ ఇంజరాపు పూజ
నవతెలంగాణ-ఖమ్మం
సురక్షితమైన సమాజం, ప్రజల భద్రతకు భరోసా కోసమే కార్డన్ అండ్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ ఇంజరాపు పూజ అన్నారు. అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నగరంలోని రమణగుట్ట, వికలాంగుల కాలనీలో ఖమ్మం టౌన్ డివిజన్ పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 03 ఆటోలను, మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై, పాత నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు. స్థానికంగా ఎలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు. నేరాల నివారణ చర్యలలో భాగంగా స్దానిక ప్రాంతాలలో ప్రజల స్వచ్ఛందంగా భాగస్వామ్యమై ముఖ్యమైన కూడలిల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. అనుమతి లేని ప్రయివేటు చిట్స్ ఫండ్స్ చేరి డబ్బులు పోగొట్టుకొవద్దని సూచించారు. మీ పిల్లలకు విద్య పట్ల మక్కువ పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ సందర్భంగా స్థానిక ప్రజలు పోలీస్ వారికి పూర్తి సహకారాన్ని అందించారని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయిన డయల్ 100 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. కార్డన్ అండ్ సర్చ్ లో ఖమ్మం టౌన్ ఏసీపీ అంజనేయులు, సిఐలు శ్రీధర్, సర్వయ్య, రామకృష్ణ, నవీన్ ,రవికుమార్, ఉదరు కుమార్, ఎస్ఐలు, మరియు70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.