Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఖర్చులకు 10వేలు వితరణ
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని వెన్నవల్లి గ్రామానికి చెందిన మత్తె సత్యనారాయణ(50) ఎస్కె మాధార్ సాహెబ్ (45) ఇటీవల పెద్దకోరుకోండి గ్రామానికి ద్విచక్రవాహనం పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనంను ఢ కొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కల్లూరు జడ్పిటిసీ కట్టా అజరుకుమార్ ఖమ్మం ప్రయివేటు హాస్పటల్‌కు వెళ్లి వారి ఇరువురిను పరామర్శించి వారికి వైద్య ఖర్చులు నిమిత్తం చెరి రూ.5వేల చొప్పున వితరణ ఇచ్చారు. కట్టా వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.