Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఎస్పి సునీల్ దత్ వదేశానుసారం గంజాయి అక్రమ రవాణా,నిల్వలను అడ్డుకట్ట వేసేందుకు వినియోగం,అనుమానిత ప్రదేశాల్లో శనివారం రాత్రి సిఐ ఉపేందర్ రావు సోదాలు నిర్వహించారు. అశ్వారావుపేటలోని వి.కె.డి.వి ఎస్ రాజు పూర్వకాలేజి, శ్రీలక్ష్మి తులశి ఆగ్రో పేపర్ బోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ క్వార్టర్స్, కాకతీయ గేట్,లారీ ఆఫీస్ ఏరియా, సంత మార్కెట్ పలు పాన్ షాప్స్ లో విస్తృత తనిఖీలు చేపట్టారు. పలువురు యువకులు గంజాయి సేవిస్తున్నట్టు అనుమానాలు రావడంతో ఈ చర్యలకు పాల్పడ్డారు.ఈ సందర్భంగా సిఐ ఉపేందర్ రావు మాట్లాడుతూ... ఎవరైనా, గంజాయి సేవించినా, సరఫరా చేసినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.