Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మెన్ తిరుమల రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆహార భద్రతా చట్టాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిటీ ఛైర్మన్ తిరుమల రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో యంపిటిసిలు, సర్పంచ్లు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, డిఆర్డిఓ, డిఈఓ, ఐసిడిఎస్, వైద్య, మున్సిపల్ కమిషనర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్, యంపిడిఓలతో ఆహార భద్రత చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆహార భద్రతా ఛైర్మన్ తిరుమలరెడ్డి, సభ్యులు భారతి, శారద, ఆహార బద్రతా కో-కన్వీనర్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆహార భద్రతా చర్యల అమలు తీరును పరిశీలన చేసేందుకు రెండు రోజుల పాటు పర్యటించినట్లు చెప్పారు. కరువు కాటకాలు, ఆహార కొరత, పౌష్టిక లోపం వల్ల మానవాళి ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో మానవ సంపదను కాపాడుకునేందుకు కమిటి ఏర్పాటు జరిగినట్లు ఆయన తెలిపారు. చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేయబడుతున్న నిత్యావసర వస్తువులు, పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయబడుతున్న నిత్యావసర వస్తువులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకున్న మహిళలకు కెసిఆర్ కిట్లు పంపిణీ, సంక్షేమ హాస్టళ్లులో విద్యార్ధులకు అందచేస్తున్న ఆహార మెనూ తదితర అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నామని, గుర్తించిన లోటుపాట్లును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించు విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార భద్రతా సమస్యలను ప్రజలు డిఆర్డిఓకు కానీ కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో 68 శాతం మంది మహిళలు రక్తహీనతతో భాదపడుతున్నారని, వీరందరికీ బలవర్ధకమైన ఆహారాన్ని అందించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడానికి వీలుగా అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో హక్కుల వివరాలను తెలియచేయు పట్టికతో పాటు హక్కులకు బంగం వాటిల్లినపుడు ఎవరికి పిర్యాదు చేయాలో వారి వివరాలను ప్రదర్శింపచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టంపై ప్రజలకు అవగాహన చాలా ముఖ్యమని చెప్పారు.
సమస్యలను తెలుసుకోవడం అభినందనీయం : జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య
కమిటి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం అభినందనీయమని కమిటి కో-చైర్మన్ జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మద్యాహ్న భోజనాలను సన్న బియ్యంతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ ముందుకు పోతున్నామని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో కమిటి సభ్యులు భారతి, శారద, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జడ్పీ సిఈఓ మెరుగు విద్యాలత, డిఆర్డిఓ పీడి మధుసూదన్ రాజు, డిఎస్ఓ చంద్రప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జెవిఎల్. శిరీష, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.