Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కిస్టు పార్టీకి ఎర్రజెండాకు వన్నెతెచ్చిన విప్లవ వీరశూరుడు
- కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిలో నిండు ప్రాణం బలి
- నేడు 26వ వర్ధంతి
నవతెలంగాణ-ముదిగొండ
కట్టకూరు వీరుడు, కమ్యూనిస్టు పార్టీ ముద్దుబిడ్డ, మార్క్సిస్ట్ యువకిశోరం, యువ నాయకుడు విప్లవ ప్రజావీరుడు, అమరుడు వీరబోయిన వెంకటేశ్వర్లు. సిపిఐ(ఎం) పార్టీ కోసం ప్రజల కోసం తన నిండు ప్రాణాన్ని త్యాగం చేసి గ్రామ కాంగ్రెస్ గుండాల దాడిలో 1995 ఆగస్టు 24వ తేదీన వీరమరణం పొంది ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన మార్క్సిస్టు, సుందరయ్య వారసుడు వీరబోయిన వెంకటేశ్వర్లు. 26వ వర్ధంతి సందర్భంగా ఆ వీరుడుని స్మరించుకుంటూ నవతెలంగాణ ప్రత్యేక కథనం.
కట్టకూరు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన వీరబోయిన వెంకటేశ్వర్లు సిపిఐ(ఎం)లో సాధారణ కార్యకర్తగా చేరి మార్క్సిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్రియాశీలక పాత్ర నిర్వహించారు. అతి కొద్దికాలంలోనే పార్టీలో అసమాన యువనాయకుడిగా ఎదిగాడు. ప్రజల సమస్యలే ఊపిరిగా భావించి పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో అగ్రభాగాన నిలిచి ప్రజా పోరాటాల్లో ముందుండేవారు. ప్రజా సమస్యలపై సాగే ప్రతి ఉద్యమంలో వెంకటేశ్వర్లు పాత్ర ఎనలేనిది. కట్టకూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సీపీఐ(ఎం) ఖ్యాతిని ప్రజల్లో ఇనుమడింపజేసే పార్టీ పురోభివృద్ధికి వెంకటేశ్వర్లు ఎంతో కష్టపడి పనిచేశారు. నూనూగు మీసాల వయసులోనే వెంకటేశ్వర్లు తనదైన శైలిలో పార్టీ ప్రతి కార్యక్రమాలలో, ఉద్యమాలలో చురుకుగా పాల్గొం టూ వీరుడులా పనిచేసి గుర్తింపు పొందారు.
వెంకటేశ్వర్లు తన కుమారుడికి సుందరయ్యని పేరు పెట్టుకొని పార్టీ పట్ల విశ్వాసాన్ని చాటుకున్నాడు. ఆనాడు 1980-95 వరకు జరిగిన వ్యవసాయ కూలీరేట్లు పెంపుదల, పాలేర్ల్ల జీతాలు పెరుగుదల ఉద్యమాలలో వెంకటేశ్వర్లు ఉక్కు సంకల్పంతో పని చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కట్టకూరు గ్రామంలో ఆనాడు కాంగ్రెస్ భూస్వామ్య పెత్తందారి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రతి మార్కిస్టు పార్టీ పోరాటంలో వెంకటేశ్వర్లు పాత్ర, కృషి ఉంది. ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన ప్రతి ప్రజా ఉద్యమంలో వెంకటేశ్వర్లు పాత్ర అమోఘమైనది. గ్రామంలోనే పార్టీ బలోపేతం,అభివద్ధి, ప్రజాఉద్యమాల పట్ల ప్రజలు ఆకర్షితులై మార్కిస్టు పార్టీ ఉద్యమం ఎర్రజెండా రెపరెపలు చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ భూస్వామ్య పెత్తందార్లు పార్టీని నిర్బంధాలతో అణిచివేయాలని కుట్రపన్ని పార్టీ ముఖ్య కార్యకర్తలపై దాడులు చేసి నిర్బంధాలు ప్రయోగించారు. విప్లవయువ కిశోరం వీరబోయిన వెంకటేశ్వర్లు ఏమాత్రం ప్రత్యర్థి దాడులకు భయపడకుండా గుండె ధైర్యంతో శత్రువులను తరిమికొట్టి ఎర్రజెండాకు వన్నె తెచ్చారు. కట్టకూరు గ్రామంలో వెంకటేశ్వర్లును హతమార్చాలని దొంగచాటుగా మాటువేసి కాపుకాసి కాంగ్రెస్ భూస్వామ్య గుండాలు జరిపిన దాడుల్లో వీరబోయిన వెంకటేశ్వర్లు 1995 అక్టోబర్ 24న అమరుడై నిలిచాడు. ఆ వీరుని మరణం నేటికి 26 సంవత్సరాలు కావస్తున్న ప్రజలగుండెల్లో చెరిగిపోని గుర్తుగా మిగిలాడు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా గ్రామం నడిబొడ్డున స్తూపమై, ఎర్రసన్యంలా, ఎరుపెక్కిన ఎర్రనిజెండా గుండెల్లో రెపరెపలాడుతూ జనలోకానికి తొలిపొద్దులా నిలిచాడు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు అర్పించనున్నారు.