Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
- మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం
కూసుమంచి : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె ధరలు తగ్గించాలని, వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మండలంలోని నాయకన్‌గూడెం గ్రామంలో నేషనల్ హైవేపై మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బారి మల్సూర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పట్టని బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి కర్ణబాబు, సీనియర్ నాయకులు కంచర్ల జగన్మోహన్రెడ్డి, గడ్డం మురళి, లిక్కి లింగయ్య, సింగం కృష్ణంరాజు, గడ్డం పవన్, ఎస్ జాని, మేకల నాగేశ్వరరావు, చిలకబత్తి స్వరూప, యాదగిరి, వేణు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం: సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండలంలోని పాపాయిగూడెం గ్రామంలో శనివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, నాయకులు పద్మనాబుల సుధాకర్, రేపాకుల వెంకన్న, శాఖ కార్యదర్శి శొంఠి వెంకటేశ్వర్లు, రేపాకుల భద్రయ్య, బొడ్డు లక్ష్మీ నారాయణ, నగండ్ల పద్మావతి, గుంటి వీరభద్రం పాల్గొన్నారు.
ముదిగొండ : సిపిఎం ఆధ్వర్యంలో మండల పరిధిలో వల్లాపురం గ్రామంలో ప్రధాన మంత్రి మోడీ దిష్టిబొమ్మ శనివారం దగ్ధం చేశారు.కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు మందరపు వెంకన్న, రవికుమార్, వ్యకాస మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, పార్టీ సీనియర్ నాయకులు మద్దినేని దశరథరామయ్య. నాయకులు అయినల అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.