Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ- బోనకల్
కలకోట గ్రామంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూ నికరంగా నిలబడిన నాయకుడు యంగల ఆదాము అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కొనియాడారు. మండల పరిధిలోని సిపిఎం కలకోట తాజా మాజీ శాఖ కార్యదర్శి అమరజీవి ఎంగల ఆదాము సంతాప సభ శనివారం జరిగింది. తొలుత ఆదాము స్థూపానికి పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఎం మధిర డివిజన్ కన్వీనర్ చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు పలువురు మండల కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలకోట గ్రామంలో ఆదాము పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశాడని కొనియాడారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకు వచ్చే వారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం తపన పడేవాడు అన్నారు. గ్రామంలో ఇతర పార్టీల నుంచి అనేక రకాలుగా బెదిరింపులు, నిర్బంధాలు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో మృతి చెందే వరకు పార్టీలోనే క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పని చేశాడు అని కొనియాడారు. ఆదాము కుటుంబానికి సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమోదు నాగేశ్వరరావు, కొమ్ము శ్రీనివాసరావు, గుగులోతు నరేష్, మందడపు శ్రీనివాసరావు, గుడిపూడి వెంకటేశ్వర్లు, గుగులోతు పంతు, ఉల్లి నరేష్, పెదప్రోలు కోటేశ్వరరావు, మర్రి తిరుపతిరావు, బంధం శ్రీనివాసరావు, కందికొండ శ్రీనివాసరావు, ఆదాము కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.