Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్
నవతెలంగాణ-ఖమ్మం
రక్తదానం సామాజిక బాధ్యతని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (పోలీసు ఫ్లాగ్ డే ) పురస్కరించుకొని శనివారం ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ అవరణలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతి సమాజ నిర్మాణంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళులర్పిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజసేవలో పాలుపంచు కోవాలన్నారు. రక్తదాన శిబిరాల వల్ల ప్రమాద సమయంలో ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందుతుందని తెలిపారు. రక్తదానం చేసిన వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు. 26 సార్లు రక్తదానం చేసిన స్పెషల్ బ్రాంచ్ ఎఏస్సై సుధాకర్ రెడ్డి, 18 సార్లు రక్తదానం చేసిన సిఐ అంజలి, 16 రక్తదానం చేసిన ఎస్బీ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ సూరిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రక్తదాతలకు పండ్లను అందజేశారు. ఆటో డ్రైవర్లు, యువకులు, పోలీస్ సిబ్బంది ఉత్సహంగా 50 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ అంజనేయులు, రామోజీ రమేష్, ఏఆర్ ఏసీపీ విజయబాబు, సిఐ లు అంజలి, చిట్టిబాబు , శ్రీధర్, రామకృష్ణ, తుమ్మ గోపి, శ్రీనివాసులు, ఆర్ఐ లు రవి, శ్రీనివాస్ ,తిరుపతి, శ్రీశైలం, కార్పొరేటర్ వేంకటేశ్వర్లు, డాక్టర్లు బి. బాలు, జీతేందర్ తదితరులు పాల్గొన్నారు.