Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
పశు జాతిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలతో కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 'జాతీయ పశుసంపద మిషన్' ద్వారా ఔత్సాహికులైన వారికి ఈ పథకాన్ని వర్తింప చేయనుంది. మాంసం ఉత్పత్తి చేసే గొర్రెలు, మేకలు, అత్యధిక పునరుత్పత్తి గల జీవాలు, కోళ్లు, పందుల పెంపకానికి 50శాతం రాయితీపై యూనిట్లను మంజూరు చేస్తుంది. అర్హులైన వారు ఈ నెల 30లోగా హెచ్ టిటిపి:// డిఎహెచ్డి.ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డా. వేణుమనోహర్ తెలిపారు. ఈ యూనిట్లకు ఎలాంటి పరిమితీ లేదని, ఎంతమందైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మాంసం ఉత్పత్తిపై ఆసక్తి ఉన్న వారు ఇతర వివరాల కోసం జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.