Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంకర రాళ్లే పట్టు పరుపులు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఆంధ్ర రాష్ట్రంలో పనులు దొరకక తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పనుల కోసం వచ్చి పసిపాపలను కంకర రాళ్ల మీద రైల్వే పట్టాలు పక్కన రైల్వే పట్టాల మధ్య పరుండబెట్టి తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ కనిపించారు. అటుగా వచ్చిన ప్రయాణికులు పసిపాపలు పండుకున్న దృశ్యాన్ని చూసి ఒకింత చలించిపోయారు. పసిపాపల తండ్రి దుర్గ, తల్లి శాంత కుమారి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఈసరం గ్రామానికి చెందినవారు. కూలి పనుల నిమిత్తం ఎర్రుపాలెం రైల్వే ప్లాట్ ఫారం చుట్టూ గల పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయటానికి భార్య భర్తలద్దరికీ రోజువారి కూలి 1100 రూపాయలకు ఇచ్చే పద్ధతి మీద మాట్లాడి కాంట్రాక్టర్ తీసుకొని వచ్చి పనులు చేపిస్తున్నట్లు వారు తెలిపారు. వారితో పాటు మరికొన్ని కుటుంబాలు కూడా వచ్చినట్లుగా తెలిపారు. పొట్ట కూటి కోసం తమ సొంత గ్రామాలను విడిచి నెలల తరబడి కూలి పనుల కోసం రావటం జరుగుతుందని వారు ఆవేదన వెలిబుచ్చారు. పసిపిల్లలతో కూడి వచ్చి పనులు చేసుకుంటున్నామని వారు తెలిపారు.