Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
వచ్చే నెల1వ తేదీన మండలంలోని గంగారం వాసురెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే సీపీఐ(ఎం) సత్తుపల్లి రూరల్ మండల 8వ మహాసభలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆ పార్టీ మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ కోరారు. ఈ మహాసభకు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు తాతా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు పాల్గొననున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ మహాసభ ప్రారంభమవుతుందని, సభకు వచ్చే కార్యకర్తలు, అభిమానులు ఎరుపురంగు వస్త్రాలు, మాస్కులు ధరించి రావాల్సిందిగా కోరారు.