Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఫ్లాగ్డేను పురష్కరించుకొని సోమవారం ఖమ్మం టౌన్ డివిజన్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు టౌన్ ఏసీపీ అంజనేయులు, ఎస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏఆర్ ఏసీపీ విజయబాబుతో కలసి ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్ అధికారులతో పాటుగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఔత్సాహికులను స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది అమరవీరులకు జోహార్లు అంటూ... ఉత్సాహంగా పాల్గొన్నారు.
సైకిల్ ర్యాలీ ఖమ్మం వన్ పోలీస్ స్టేషన్ నుండి వైరా రోడ్డు, మమత హాస్పిటల్ రోడ్డు, లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది. అనంతరం ట్రాఫిక్ టౌన్ ఏసీపీ మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సు, శాంతి భద్రతల కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసు అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలువాలన్నారు. ర్యాలీలో సిఐలు చిట్టిబాబు, అంజలి, శ్రీధర్, సర్వయ్య, రామకృష్ణ, ఆర్ఐలు టీ.రవి, శ్రీనివాస్, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం పాల్గొన్నారు.