Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది నెలలుగా ఆగిపోయిన పింఛన్
- పట్టించుకొని అధికారులు
నవతెలంగాణ-కొణిజర్ల
పంచాయతీ కార్యదర్శి చేసిన నిర్వాకానికి ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఫించన్ ఆగిపోయింది. కేవలం ఫించన్ పైసలపై ఆధారపడి బతికే తనకు ఎనిమిది నెలలుగా ఫించన్ రావడం లేదని మండల పరిధిలోని సింగరాయ పాలెం గ్రామానికి వేము బుతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నొప్పులతో నీరసంగా ఉన్నానని డబ్బులు లేక ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నానని వాపోయింది. ఇదే గ్రామానికి చెందిన వేము రత్తమ్మ అనే మహిళ పదినెలల క్రితం ఆనారోగ్యంతో మరణించింది. అయితే ఆ సమయంలో ఇంచార్జు పంచాయతీ కార్యదర్శిగా సిద్దిక్ నగర్ గ్రామానికి చెందిన సందీప్ కార్యదర్శి ఉండటంతో మరణించిన రత్తమ్మ పేరు తొలగించకుండా బుతమ్మ పేరు తొలగించడంతో ప్రతినెల ఆసరా కోల్పోవాల్సివచ్చింది. ప్రతినెల బ్యాంకు ఖాతాలో జమఅయ్యే ఫించన్ రాకపోవడంతో ఆమె మనవడు పంచాయతీ కార్యదర్శిని అడగడంతో పొరపాటున రత్తమ్మ పేరు తొలగించకుండా బుతమ్మ పేరు తొలగించడం జరిగిందని చావుకబురు చల్లగా చెప్పారు. వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి ఫించన్‌ను అందేలా చూస్తానని ఎంపీడీఓ ఆర్ రమాదేవి హామీ ఇచ్చినా నేటికీ వరకూ ఫించన్ రాకపోవడంతో బుతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. జిల్లా కలెక్టర్ అయినా స్పందించి తనకు ఫించన్ అందేలా చూడాలని వేడుకొంటుంది.