Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్లే రహదారి అధ్వానం
నవతెలంగాణ-కొణిజర్ల
22 కిలోమీటర్లకు ఒకటి కాదు పదికాదు ఏకంగా 282 గుంతలు ఉన్నాయి. ఈరహదారి గిరిజన ప్రాంతాల్లో లేదు. జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్లే డబల్ రోడ్డు పరిస్థితి. డబల్ రోడ్డు నిర్మించి మూడు సంవత్సరాలు గడవకముందే రోడ్డు అంతా గుంతలమయమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు మూరలోతు గుంతులు పడ్డాయి. గతంలో సింగిల్ రహదారిగా ఉన్నప్పుడు వాహన రాకపోకలు తక్కువగా ఉండేవి. మూడు సంవత్సరాల క్రితం డబుల్ రోడ్డుగా మారడంతో ఈ రహదారి గుండా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చత్తీస్గఢ్ ప్రాంతాలకు కార్లు, లారీలు, బస్సులు, వాల్వోలు నిత్యం సమయంతో సంబంధం లేకుండా వందలసంఖ్యలో తిరుగుతున్నాయి. వీటితో పాటు పల్లిపాడు నుంచి ఏన్కూర్ల మధ్య ఉన్న గ్రామాలకు చెందిన ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, స్కూల్ బస్లు ప్రతిరోజూ తిరుగుతు న్నప్పటికీ అధికారులు గుంతలను పూడ్చక పోవడంతో ప్రతిరోజూ వాహనదారులు ప్రమా దాలకు గురౌతున్నారు. ప్రమాదాల బారినపడి వికలాంగులుగా మారుతూ మానసికంగా ఆర్థికంగా కుటుంబాలు నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుంతలు పూడ్చి రోడ్డు ప్రమాదాలను నివారిం చాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రమాదబారినపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గ ఇంచార్జు భూక్యా వీరభద్రం
పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్లే దారిలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం గుంతలు పడిన రోడ్లను సకాలంలో ప్రభుత్వం అధికారులు పూడ్చపోవడమే. ఇటీవలే తీగలబంజర లాలాపురం గ్రామాల సమీపంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారు ఢకొీనడంతో కాలు కోల్పోవల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు గురైన కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ ఆదుకోవాలని వీరభద్రం డిమాండ్ చేశారు.