Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
ఏదులాపురం, సత్యనారాయణపురం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సిఫారసుతో మంజూరైన చెక్కులను సిపిఎం మండల నాయకులు ఉరడీ సుదర్శన్‌రెడ్డి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏదులాపురం గ్రామానికి చెందిన బొడ్డు నాగమణికి 26,500, బొడ్డు శంకర్‌కు 13,500, దుండిగల వెంకటేశ్వర్లుకు 13,500, వీరమ్మకు 48 వేల రూపాయలు, సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన పస్తం వెంకన్నకు మంజూరైన 34,500 రూపాయల చెక్కును సుదర్శన్ రెడ్డి, తోట పెద్ద వెంకటరెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చినా తీర్చేందుకు సిపిఎం శాఖ సిద్ధంగా ఉందన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 92 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొన్నెకంటి నరసింహారావు, నందిగామ కృష్ణ, అర్వపల్లి శ్రీనివాస్, వల్లెపు సోమరాజు, దుండిగల నాగయ్య, వెంకటేశ్వర్లు, తమ్మనబోయిన లింగయ్య, అబ్బులు, బ్రహ్మం, ఉప్పలి, భద్రయ్య, డివైయఫ్ఐ నాయకులు గడ్డం సిద్ధూ, పొన్నెకంటి అనీష్, తోట నరేష్ రెడ్డి, గోపాల్, యేసు, తమ్మనబోయిన శేఖర్, ఎస్ఎఫ్ఐ నాయకులు మామిళ్ల పవన్‌రెడ్డి, చామకూరి వెంకటేష్, లాలు ప్రసాద్, నాగరాజు, సాయి, అజరు పాల్గొన్నారు.